రోజూ పెరుగు తినే వారు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు

పెరుగులో చక్కెర కలుపుకుని తినడం వల్ల ఎసిడిటీ, ఊబకాయం ముప్పు పెరుగుతుంది. 

పెరుగు వల్ల జలుబు, దగ్గు, సైనస్ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. చలికాలంలో ఈ సమస్య ఎక్కువ

పెరుగును నిమ్మజాతి పండ్లతో కలిపి తింటే ఎసిడిటీ, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది

ఉత్త పెరుగుకు బదులు అందులో అల్లం, బ్లాక్ సాల్ట్ వంటివి జత చేసుకుని తింటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. 

ఫ్లేవర్డ్ యోగర్ట్స్‌లో చక్కెరలు, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి కాబట్టి సాధారణ పెరుగు తినడమే బెటర్

పెరుగును ఉల్లిపాయలు, వంకాయలు వంటి వాటితో కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు రావొచ్చు

పెరుగుతో పాటు సమతుల ఆహారం తినేందుకు ప్రాధాన్యమిస్తే ఆరోగ్యాన్ని పది కాలాల పాటు కాపాడుకోవచ్చు