టీలో యాలకులు వేసి
తాగుతున్నారా..
సాయంత్రం తాగే టీలో యాలకులు వేసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ తాగితే ఉపయోగం ఉంటుంది.
యాలకులు జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. తద్వారా ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
నోటి దుర్వాసనను తగ్గించడంలో యాలకులను మించినది మరొకటి లేదు. నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా యాలకులు కీలక పాత్ర పోషిస్తాయి.
యాలకులు రక్తపోటును నివారించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తాయి.
బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న వారు యాలకుల టీ తాగడం మంచిది.
యాలకులు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
యాలకులలో యాంటీ-ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
యాలకులు నోటిలోని హానికర బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. కావిటీస్, చిగుళ్ల వ్యాధిని నివారించడంలో సహాయపడతాయి.
Related Web Stories
తమలపాకులు తింటే.. ఈ సమస్యలన్నీ దూరమైనట్లే..
రోజూ పెరుగు తినే వారు ఈ విషయాలను అస్సలు మర్చిపోకూడదు
ఈ జ్యూస్లు తాగితే.. మీ బీపీ కంట్రోల్ అవుతుంది..!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచిదేనా?