అనపకాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, అల్సర్‌ సమస్యలు తగ్గుతాయి.

వీటిలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి అధికంగా తినాలనే కోరికను తగ్గించి శరీరం బరువు పెరగకుండా నియంత్రిస్తాయి.

ఈ గింజలను ఉడికించి తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గుతుంది.

అనపకాయల్లో అధికంగా ఉండే డి విటమిన్‌, కాల్షియం, పాస్ఫరస్‌ లాంటి పోషకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

అనపకాయ గింజల్లో ఉండే అమైనో ఆమ్లాలు.. హార్మోన్లను సమతుల్యంలో ఉంచుతాయి.

మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదం చేస్తాయి.

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.