రంజాన్‌ మాసంలో ప్రత్యేకంగా తయారుచేసే హలీమ్‌ పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి.

హలీమ్‌ను గోధుమ రవ్వ/గోధుమలు, పప్పులు, మాంసం ( మటన్‌ లేదా చికెన్‌), నెయ్యి, మసాలాలతో నెమ్మదిగా ఉడికించి తయారు చేస్తారు.

ఇందులో కార్బోహైడ్రేట్లు, మంచి ప్రొటీన్‌, కొంత ఫైబర్‌, ఐరన్‌ లాంటి పోషకాలు ఉంటాయి.

ఎక్కువసేపు ఉడకడం వల్ల మాంసం తేలికగా అరిగేందుకు కూడా వీలుంటుంది.

 దీర్ఘకాల ఉపవాసం చేసిన తర్వాత తక్కువ మోతాదులో తీసుకుంటే శరీరానికి త్వరగా శక్తి అందుతుంది. 

అయితే ఉపవాసం లేకుండా సాధారణ రోజుల్లో ఎక్కువ పరిమాణంలో తీసుకోకూడదు. 

అధిక నెయ్యి, మాంసం నుంచి వచ్చే కొవ్వు కారణంగా క్యాలరీలు చేరడం వల్ల బరువు పెరుగుతారు.

కొలెస్ట్రాల్‌, మధుమేహం లాంటి సమస్యలుంటే, అవి అధికమవుతాయి.