వేసవి కాలంలో ఎండ వేడి పెరిగే కొద్దీ శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు సహజ పానియాలు తాగడం ముఖ్యం.
అయితే, ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు, చెరకు రసం ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం..
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు ఉంటాయి.
ఇందులోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి.
ఇక, చెరకు రసం తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలసట తగ్గించడంలో తోడ్పడుతుంది.
దీనిలో కొన్ని ఖనిజాలు, విటమిన్లతోపాటు చక్కెరస్థాయిలు అధికంగా ఉంటాయి.
అందువల్ల మధుమేహం ఉన్నవారు దీని జోలికి అతిగా వెళ్లకపోవడం ఉత్తమం.
ఈ రెండు పానియాలు తీసుకునే ముందు ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలి.
Related Web Stories
షుగర్, హార్ట్ ప్రాబ్లమ్.. ములక్కాడలు తింటే..
నిమ్మ రసంతో ఎన్నో లాభాలు
ఈ చర్మ సమస్యలు.. లివర్ ఫెయిల్యూర్‌కు సంకేతాలు కావొచ్చు..
ప్రోటీన్ పౌడర్ కంటే మిల్లెట్స్ ఎందుకు ఉత్తమం..