జామ vs అరటి.. ఆరోగ్యానికి వీటిల్లో ఏది మంచిదో తెలుసా..

జామ పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఉపయోగపడతాయి.

అరటిపండ్లలో విటమిన్-బి3, బి6, బి12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.

జామ పండు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

అరటిపండు బీపీని అదుపులో ఉంచుతుంది. రోజూ ఒక అరటిపండు తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. 

జామ పండు జ్యూస్‌ తాగితే చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. 

అరటిపండు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

జామ, అరటి.. రెండింటిలోనూ వేర్వేరు పోషకాలు ఉంటాయి. ఈ రెండూ మన ఆరోగ్యానికి మంచివే.