ప్రెగ్నెన్సీ సమయంలో జామకాయ తింటే ఏం అవుతుంది..?

గర్భధారణ సమయంలో రక్తహీనత చాలా సాధారణం. జామకాయలో ఐరన్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి.

జామకాయలో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

 జామకాయలో ఉండే విటమిన్ సి తల్లి రోగనిరోధక శక్తిని పెంచడానికి, అంటువ్యాధులు , సాధారణ జలుబు వంటి వాటి నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.

జామకాయలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ప్రీ-ఎక్లాంప్సియా వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఇందులో ఉన్న ఫోలిక్ ఆసిడ్ శిశువు నాడీ వ్యవస్థ మెదడు అభివృద్ధికి చాలా అవసరం. వెన్నెముక సమస్యలను నివారిస్తుంది.

జామకాయలోని ఫైబర్ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జామకాయను మితంగా తింటే, ఇది ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికి, బిడ్డకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

జామకాయ వల్ల నేరుగా పెద్దగా నష్టాలు లేనప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటించాలి.