శరీర సౌందర్యం కోసం అనేక సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉంటారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో చూసుకుంటే అనేక రకాల సౌందర్య ఉత్పత్తులు విరివిగా లభిస్తున్నాయి.
ప్రస్తుత రోజుల్లో కూడా అనేక మంది శరీరం తళతళ మెరవడం కోసం ముఖానికి,చేతులకు పసుపును రాసుకోవడం మనం చాలా సార్లు చూస్తుంటాం.
పసుపును వంటలలో వాడడమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా వాడతారు.
పసుపు ప్రథమ చికిత్స వాడతారు పసుపును గాయమయిన చోట రాస్తారు రక్తస్రావం త్వరగా ఆగిపోతుందని చాలా మంది నమ్ముతారు.
పసుపును శరీరానికి అప్లై చేయడం చాలా సులువైన పని.
అలా ముఖానికి అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలనే విషయం చాలా మందికి సరిగ్గా తెలియదు.
ఏ ఫేస్ ప్యాక్లనైనా సరే ముఖానికి అప్లై చేసినపుడు కేవలం 20 నిమిషాల సేపు ఉంచితే సరిపోతుంది
ఎక్కువ సేపు పసుపును ముఖం మీద ఉంచడం వలన ముఖంపై పసుపు చారలు ఏర్పడి ముఖం అందవిహీనంగా తయారవుతుంది.
Related Web Stories
కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించే చిట్కాలు
మామిడి పండ్లను అతిగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కలగడం ఖాయం..
ప్లమ్ పండ్లు తింటే ఈ వ్యాధులన్నీ మటుమాయం...
పీచ్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..