రాత్రి కాస్త నిద్ర తగ్గినా,ఒత్తిడికి  గురయినా కళ్ల కింద  నల్లని వలయాలు  పలకరింపచేస్తాయి.

గోరువెచ్చని కొబ్బరినూనెను తీసుకుని కళ్లచుట్టూ రాయండి.

చర్మంలోకి ఇంకేలా మునివేళ్లతో అయిదు నిమిషాలు మర్దన చేయాలి.

రోజూ చేస్తే సరి. సున్నితమైన కళ్లకింది చర్మాన్ని బిగుతుగా చేయడమే కాదు,

బ్లాక్‌ లేదా గ్రీన్‌ టీ కూడా ఇందుకు సాయపడుతుంది. నలుపుదనాన్నీ తగ్గిస్తుంది.

వాడిన టీ బ్యాగులను కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, ఆపై కళ్లమీద పావుగంట ఉంచితే సరి.

కీరదోసను సన్నగా గుండ్రని చక్రాల్లా కోసి, కళ్లమీద రోజూ పదిహేను నిమిషాలు ఉంచొచ్చు.

కీర రసం, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని కళ్ల కింద దూది సాయంతో రాయాలి.

బంగాళదుంప తొక్కతో కళ్ల కింద రుద్ది చూడండి. లేదంటే దాని రసాన్ని రాసి, పావుగంటయ్యాక కడిగేసినా పర్లేదు

టొమాటో చిన్న ముక్క తీసుకుని రుద్ది, పది నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగేయొచ్చు.