వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కానీ  ఎక్కువగా వాడితే జరిగేది ఇదే..

 వెలుల్లి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

అయితే వెల్లుల్లిని ఎక్కువగా తింటే జీర్ణ సంబంధ సమస్యలు కలుగుతాయి. 

వెల్లుల్లిలో ప్రక్టాన్ అనే సమ్మేళనం ఉంటుంది.  దీన్ని పెద్ద పరిమాణంలో తీసుకుంటే ప్రేగులకు ఇబ్బంది కలుగుతుంది.

 గుండె మంట, యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం, వికారం, అపానవాయువు, పెస్టిక్ అల్సర్ సమస్యల ప్రమాదం పెంచుతుంది.

వెల్లుల్లి జోడించి వండిన ఆహారాన్ని తీసుకుంటే నోరు దుర్వాసన వస్తుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. 

వెల్లుల్లి అధికంగా తింటే ఎదురయ్యే ప్రమాదకరమైన సమస్యలలో రక్తస్రావం కూడా ఒకటి.

 తలతిరగటం, తలనొప్పి, దృష్టి తగ్గడం వంటివి ఏర్పడతాయి.

ముఖ్యంగా వెల్లుల్లిని పచ్చిగా తీసుకుంటే ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.