బెల్లంతోపాటు ఈ ఒక్కటి కలిపి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు..

 బెల్లం, నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్స్ ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.

విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం, నువ్వుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తాయి.

నువ్వులు నోటి శుభ్రతకు, దంతాలను కావిటీస్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.

బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్.. రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది.

బెల్లంలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. దీనివల్ల పేగు కదలికలు సజావుగా జరిగి మలబద్దకం రాకుండా ఉంటుంది.

నువ్వులను రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల హృదయ ఆరోగ్యం మెరుగవుతుంది. 

బెల్లం, నువ్వులతో చేసిన పదార్థాలు తినడం వల్ల చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.