బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిలోని రక్త ప్రసరణను మెరుగుపరుచి, కంటి అలసట తగ్గిస్తాయి.
గుడ్డులోని సొనలో కంటికి అవసరమైన జింక్, లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. కంటి పొరలు దెబ్బతినకుండా చూస్తాయి.
వంటలలో వాడే క్యాప్సికమ్ ముఖ్యంగా ఎరుపు రంగు క్యాప్సికమ్ కంటిలోని రక్త నాళాలకు చాలా మంచిది. ఇందులో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది.
బాదం, వాల్‌నట్స్, వేరుశనగలు, సన్‌ఫ్లవర్ గింజల్లో విటమిన్ E ఉంటుంది. వయసు రిత్యా వచ్చే కంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది.
క్యారెట్స్, చిలకడదుంపలో
బీటా-కెరోటిన్, విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి. రేచికటిని నివారించడానికి, కంటి చూపు స్పష్టంగా ఉండటానికి ఇవి చాలా అవసరం.
నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి వంటి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. శుక్లాలు రాకుండా చూస్తాయి. కంటిలోని రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
పాలకూర, తోటకూర వంటి ఆకుల్లో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కంటిలోని రెటీనాను దెబ్బతినకుండా కాపాడుతాయి.
Related Web Stories
చక్కెర తినటం వల్ల చర్మానికి కలిగే నష్టాలు ఏంటో తెలుసా?
కాలేయ ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్స్ ఇవే..
కర్బూజా (MuskMelon) తొక్కలో ఇన్ని పోషకాలు దాగి ఉన్నాయా..?
తవుడు నూనెతో సూపర్ బెనిఫిట్స్..