కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా?
ఈ టిప్స్ పాటించండి..
చాలా మంది కాళ్ల పగుళ్ల సమస్యతో బాధపడతారు. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలతో ఆ పగుళ్లను నివారించవచ్చు.
పాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని రాస్తే కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
ఆలోవెరా జెల్ కూడా కాళ్ల పగుళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మొక్కల నుంచి తయారయ్యే నూనెతో మర్దనా చేసినా కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
నీటిలో వెనిగర్ వేసి అందులో పాదాలాను కాసేపు ఉంచాలి. అలా తరచుగా చేస్తే కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
నిమ్మకాయ రసం, ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసినా ఫలితం కనబడుతుంది.
అరటి పళ్లతో చేసిన మాస్క్, అవకాడో మాస్క్‌లు కూడా పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
పాదాలను తరచుగా శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడూ తేమ ఉండేలా జాగ్రత్త పడాలి.
మార్కెట్లో దొరికే కొన్ని క్రీమ్స్‌ను వాడడం ద్వారా పాదాలు పొడిబారకుండా చూసుకోవచ్చు.
Related Web Stories
అరిటాకులో భోజనం చేయడం వల్ల అద్భుతమైన లాభాలు.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?
జీలకర్ర, పసుపు కలిపి నీటిని రోజూ తాగితే…
హైబీపీ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలు ఇవే
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎన్ని లాభాలో..