ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటే కిడ్నీలు పాడవుతాయా?

ఫాస్ట్ ఫుడ్ తింటే కిడ్నీలు పాడవడం నిజమేనా? దీనివెనకున్న కారణాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

ఫాస్ట్ ఫుడ్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు కు కారణం అవుతుంది. తద్వారా మూత్రపిండాలపై ఒత్తిడికి దారితీస్తుంది.

 మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్‌లో కనిపించే ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడికి కారణం అవుతాయి. ,

ఫాస్ట్ ఫుడ్ లో భాగంగా చక్కెర పానీయాలు, డెజర్ట్‌లు, ఇతర బేకింగ్ ఆహారాలు ఉంటాయి.ఇవి బరువు పెరగడానికి కారణం అవుతాయి. ,

ఫాస్ట్ ఫుడ్ లో ఉప్పు ఎక్కువ, నీటి శాతం తక్కువ ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతం తగ్గిపోవడానికి దారితీస్తుంది.

ఫాస్ట్ ఫుడ్ అధికంగా ఉండే ఆహారం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా గుండె జబ్బులు, స్ట్రోక్, ని క్యాన్సర్‌ల వంటి ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.