చాలా మందికి తినేటప్పుడు, తాగేటప్పుడు ఎక్కిళ్లు వస్తుంటాయి.

ఎవరో మనల్ని తలుచుకుంటున్నారు అంటూ పెద్దలు చెపుతుంటారు.

సైన్స్ ప్రకారం ఎక్కిళ్లు అనేవి మన శరీరంలో జరిగే ప్రక్రియ.

శాస్త్రవేత్తల ప్రకారం, ఎక్కిళ్ళు నేరుగా శ్వాసకు సంబంధించినవి.

జీర్ణక్రియ లేదా శ్వాసకోశ వ్యవస్థలో భంగం, అధిక కదలిక ఉంటే, వెక్కిళ్ళు మొదలవుతాయి.

గాలి పీల్చినప్పుడు డయాఫ్రాగమ్ దానిని క్రిందికి లాగుతుంది.

ఊపిరి వదిలినప్పుడు అది విశ్రాంతి స్థానానికి తిరిగి వస్తుంది.

డయాఫ్రాగమ్ సంకోచం కారణంగా, ఊపిరితిత్తులు వేగంగా గాలిని తీసుకోవడం ప్రారంభిస్తాయి, దీని కారణంగా వ్యక్తికి ఎక్కిళ్ళు వస్తాయి