తులసి ఆకులు నీరు.. వీరికి మాత్రం  విషంతో సమానం

ఆయుర్వేదం ప్రకారం తులసి అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్క. ప్రాచీన కాలంలో అనేక ఆరోగ్య సమస్యలకు తులసిని ఔషధంగా వాడేవారు.

తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది .

తులసి లోని ఔషధ గుణాలు సూర్య రశ్మి నుంచి రక్షణ ఇస్తాయి. అతినీలలోహిత కిరణాలు శరీరంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపవు,

తులసి నీరు తాగడం వల్ల మలబద్ధకం, విరేచనాల సమస్యలు తగ్గుతాయి. జీర్ణ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

 తులసిలో ఉండే ఔషద గుణాలు వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరం త్వరగా తగ్గిస్తాయి.

వేడి పదార్థాలు తినకూడని వారు  గర్భిణీలు లేదా పాలిచ్చే స్త్రీలు, ఆమ్లత్వం, రక్తపోటు, మధుమేహం లేదా మరేదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు తులసి నీటిని తాగే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.