వెలగపండులో ఎన్నో పోషకాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ పండు రెగ్యులర్‍గా తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

పేగు కదలికలు సులభతరం చేసి జీర్ణ సమస్యలు దూరం చేస్తుంది.

విరేచనాలు, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం సమస్యలు నివారిస్తుంది.

తెల్ల రక్త కణాలను ఉత్తేజపరిచి వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.

వెలగపండు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా చేస్తుంది.

జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.

కాలేయ ఆరోగ్యాన్ని వెలగపండు మెరుగుపరుస్తుంది.

రక్తపోటు తగ్గించడం, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రిస్తుంది.