మొలకలలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. రక్తపోటు నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది.
జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‍లు ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కడుపు ఉబ్బరం, అజీర్ణాన్ని సులభంగా తగ్గిస్తాయి.
మొలకల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‍తో పోరాడడంతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్పెక్షన్లు, సీజనల్ సమస్యలను నివారిస్తాయి.
మొలకలలో ఉండే ఫోలేట్, విటమిన్-కె మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరానికి కావలసినంత శక్తిని అందిస్తాయి.
రక్తంలో చెక్కర స్థాయి నియంత్రించడంలో మొలకలలో ఉండే ఫైబర్ సహాయపడుతుంది.
మొలకల్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ఆకలిని నియంత్రిస్తాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తాయి. తద్వారా సులువుగా బరువు తగ్గిస్తాయి.
Related Web Stories
శీతాకాలంలో వెల్లుల్లితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మహిళలు గాజులు ఎందుకు వేసుకోవాలో తెలుసా..?
వీళ్లు అల్లం తింటే ఇంకా అంతే సంగతి..
మనం సాధారణంగా తాగే గేదె పాలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?