ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. 

శరీరంలో పేరుకుపోయిన విషాన్ని తొలగించడంలో బొప్పాయి బాగా పని చేస్తుంది. 

కడుపులోని పీహెచ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సాయం చేస్తుంది. 

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహకరిస్తుంది. 

బొప్పాయిలో నల్ల ఉప్పు, నల్ల మిరియాలు జోడించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.