మఖానాలో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, కేలరీలు తక్కువగా ఉంటాయి

ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి, అతిగా తినడాన్ని తగ్గించి తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మఖానాలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి  మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

మఖానాలో మెగ్నీషియం అధికంగా ఉండి, సోడియం తక్కువగా ఉంటుంది.

ఇది బీపీని అదుపులో ఉంచడానికి గుండె పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ఇందులో కాల్షియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి.

ఇది ఎముకల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.

ముఖ్యంగా వృద్ధులలో ఆస్టియోపోరోసిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది.