ప్రయాణం చేసే సమయంలో  ఈజీగా తినగలిగే  సూపర్ ఫుడ్స్ ఇవే!

చియా:  వీటిని వెంట తీసుకువెళ్లడం తేలిక. నీళ్లు కలిపి నేరుగా తినేయవచ్చు. 

బాదం: ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్‌ ఇ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే బాదం పప్పులు అద్భుతమైన అల్పాహారం. 

డార్క్‌ చాక్లెట్‌: యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం కలిగి ఉండే డార్క్‌ చాక్లెట్‌ మనసును ఉల్లాసంగా ఉంచుతుంది.

ప్రయాణాల్లో వీటిని వెంట తీసుకువెళ్లడం కూడా తేలికే.

డ్రైడ్‌ ఫ్రూట్స్‌:  బరువు తక్కువగా ఎండిన  పండ్లు తక్షణ శక్తినిస్తాయి.  వీటిలోని పోషకాలు ఆకలిని కూడా అదుపులో ఉంచుతాయి. 

కాబట్టి అంజీర్‌, ఎండుద్రాక్ష, అప్రికాట్స్‌, ఎండు ఖర్జూరం లాంటి ఎండిన పండ్లను వెంట ఉంచుకోవాలి.