బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేముందు కనిపించే లక్షణాలివే..

బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకు రక్తం సరఫరా ఆగిపోవడం. ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడులోని కణాలు దెబ్బతింటాయి.

స్ట్రోక్ వస్తే సాధారణంగా ముఖం ఒక వైపు వంకరగా అవుతుంది. నవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఒక వైపు చిరునవ్వు వంకరగా కనిపిస్తుంది.

శరీరం ఒక వైపున, ముఖ్యంగా చేతులు లేదా కాళ్ళలో అకస్మాత్తుగా తిమ్మిరి లేదా బలహీనత వస్తుంది.

ఒక్కసారిగా దృష్టి మసకబారడం, ఒక కంటితో సరిగా కనిపించకపోవడం లేదా రెండు ప్రతిబింబాలు కనిపించడం కూడా స్ట్రోక్ లక్షణాలు కావచ్చు.

ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా తల తిరగడం, నిలబడలేకపోవడం, నడుస్తున్నప్పుడు తూలిపోవడం వంటివి కూడా స్ట్రోక్ కు సంకేతాలు.

 మాట్లాడినప్పుడు మాట నత్తిగా ఉందా లేదా సరిగా అర్థం అవ్వడం లేదా అనేది గమనించండి.

ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే సమయం వృథా చేయకుండా ఆసుపత్రికి వెళ్ళండి.

ధూమపానం, మద్యం మానేయడం మంచిది. మంచి ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.