మానవ శరీరానికి నీరు ఇంధనం లాంటిది.
మనిషి శరీరంలో దాదాపు 60 శాతం నీరు ఉంటుంది.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. తగినంత నీటిని లోపలికి పంపిస్తూ ఉండాలి.
అయితే, నీటిని ఎలా తాగుతున్నాం అన్న దాని మీద కొంత దృష్టి పెట్టాలి.
నిలబడి నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందన్న ప్రచారం ఉంది.
కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటాయని ఎక్కడో ఓ చోట వినే ఉంటారు.
అయితే, నిలబడి నీళ్లు తాగటం వల్ల నిజంగా మన కిడ్నీలపై ప్రభావం పడుతుందా?
దీనిపై బెంగళూరుకు చెందిన డాక్టర్ కిరణ్ క్లారిటీ ఇచ్చారు.
నిలబడి నీళ్లు తాగటం వల్ల కిడ్నీలకేమీ ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
సరైన మోతాదులో నీళ్లు తాగకపోతేనే కిడ్నీలపై ప్రభావం ఉంటుందన్నారు.
Related Web Stories
చలికాలంలో బొప్పాయి తింటే కలిగే ప్రయోజనాలు ఇవె..!
8 నుంచి 16 ఏళ్ల పిల్లల ముఖంపై మొటిమలు వచ్చినప్పుడు తినకూడనివి ఇవే..
ఈ లక్షణాలుంటే ప్రీ-డయాబెటిస్‌కు ఛాన్స్
వైట్ బ్రెడ్ మంచిదా? బ్రౌన్ బ్రెడ్ మంచిదా? ఏ రకం బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది..!