చలికాలంలో బొప్పాయి పండు  తింటే చాలా మంచిది

చలికాలంలో బొప్పాయి పండు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.

ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచి సీజనల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

ఇందులో ఉండే విటమిన్-ఎ, విటమిన్-సి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి.

పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటు తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.