చాలా మంది తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు గ్రీన్ టీ తాగుతుంటారు. గ్రీన్ టీలో అద్భుత గుణాలు ఉండడం వల్ల దాన్ని తాగేందుకు ఆరోగ్య ప్రియులు ఇష్టపడుతుంటారు.
గ్రీన్ టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దాని వల్ల నష్టాలు కూడా ఉన్నాయి.
మోతాదుకు మించి గ్రీన్ టీ తాగే వారిలో ఫ్లోరోసిస్ సమస్య తలెత్తుతుంది. దీని వల్ల మన దంతాలు, ఎముకలు మొదటగా రంగు మారిపోతాయి.
ఆందోళన, నిద్రలేమి సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ తాగకూడదు. గ్రీన్ టీలోని కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
గ్రీన్ టీ రక్తపోటును కొద్దిగా పెంచుతుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు గ్రీన్ టీ తక్కువగా తాగాలి
ఇప్పటికే లివర్ సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలని అంటున్నారు.
ఇతర ఆరోగ్య సమస్యలతో బాధుపడుతున్న వారు సైతం డాక్టర్లను సంప్రదించిన తర్వాతే తాగాలని సూచిస్తున్నారు.