పాలు లేని టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

చాలా మంది పాలు కలిపిన టీనే తాగుతారు. అయితే ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య పెరుగుతుంది. 

పాలు లేని టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

జీర్ణక్రియ మెరుగుపడడంలోనూ ఇది దోహదం చేస్తుంది. 

బరువు తగ్గడంలోనూ సాయం చేస్తుంది. 

బ్లాక్ టీలోని ఫ్లేవనాయిడ్స్ కేన్సర్ నుంచి కూడా కాపాడతాయి. 

రోజంతా చురుగ్గా ఉండడంతో బ్లాక్ టీ సహకరిస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.