వేసవిలో ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగితే ఒకే నెలలో దీని ప్రయోజనాలను పొందవచ్చు.

భోజనానికి 30 నిముషాల ముందు నిమ్మకాయ నీరు తాగాలి.

నిమ్మకాయ నీరు తాగడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగు పడుతుంది. 

కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

జీవక్రియ పెరగడంలోనూ ఈ నీరు సాయం చేస్తుంది.

బరువును అదుపులో ఉంచుతుంది. 

వేసవిలో వడదెబ్బను నివారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో నిమ్మకాయ నీరు సహకరిస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.