ఈ ఒక్క టీతో  ఆ సమస్యలన్నీ పరార్..

కరివేపాకు టీతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

అందుకే బ్లాక్ టీ, గ్రీన్ టీలే కాకుండా అప్పుడప్పుడు కరివేపాకు టీ కూడా తాగాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.

వారానికి ఒకటి, రెండుసార్లయినా ఈ టీ తాగడం వల్ల ఇందులో ఉండే పోషకాలు ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తగ్గిస్తాయని చెప్తున్నారు.

అలాగే గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కరివేపాకు టీ తరచుగా తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

ఇది మన శరీరంలో ఉండే టాక్సిన్స్‌ను బయటకు పంపించి వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. 

కరివేపాకు టీతో ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు. 

కరివేపాకు టీ తాగడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.