మజ్జిగ తాగితే మంచిది కానీ..వీరు ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు!.. ఎందుకో తెలుసా?
వేసవి ఎండల నుంచి శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన పానీయం మజ్జిగ. మజ్జిగ ఒక పోషకమైన పానీయం మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది..
పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్న మజ్జిగ కొందరికి మాత్రం అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
కొందరిలో పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవటం వల్ల ఇబ్బందులు పడుతుంటారు.
పాలు లేదా పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారికి మజ్జిగ తాగడం వల్ల కూడా అలెర్జీ ప్రతిచర్య ఉండవచ్చు. అలాంటి వారికి మజ్జిగ సరిపడదు.
ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ జలుబు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఛాతీలో కఫం పేరుకుపోయే సమస్యను పెంచుతుంది.
జలుబు లేదా దగ్గుతో ఇబ్బంది పడుతున్నవారు మజ్జిగ తీసుకోవడం వల్ల లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా మజ్జిగను ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా మజ్జిగ తీసుకోవటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
రోజూ పరగడుపున వేపాకులు నమిలితే ఎన్ని లాభాలో తెలుసా?
అంజీర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా...!
బరువు తగ్గడానికి ఈ ఐదు టీలు చాలట.. ఓసారి ట్రై చేసి చూడండి..!
డార్క్ చాక్లెట్ ఒక రోజులో ఎంత తినాలో తెలుసా..