బాదం పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బాదం పాలలోని విటమిన్-E, విటమిన్-D, కాల్షియం తదితర పోషకాలు ఆరోగ్యాన్ని అందిస్తాయి.

బాదం పాలలోని అనేక పోషకాలు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.

తరచూ బాదం పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బాదంలోని మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు.. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. 

బాదం పాలలోని కాల్షియం, మిటమిన్లు.. ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

బరువు నియంత్రణలో ఉంటుంది.

బాదం పాలు రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచవు. దీనివల్ల డయాబెటిస్ ఉన్న వారికీ ఇబ్బంది ఉండదు.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.