మామిడి పండ్లు ఇలా తింటే..  ఆరోగ్యమే ఆరోగ్యం..

మామిడి పండ్లలో విటమిన్లు పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

వీటిని ముక్కలు చేసుకొని మిక్సీలో పేస్ట్ లా చేసి పాలల్లో కలుపుకొని తింటే రెట్టింపు ప్రయోజనం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మామిడి జ్యూస్ తాగినా కూడా ఎముకలు బలంగా తయారవుతాయని చెబుతున్నారు.

పండిన మామిడి పండ్లను పాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మంచి రంగు వస్తుంది. అలాగే ఇది శరీరాన్నిని చల్లబరుస్తుంది.. అధిక పోషకాలను అందిస్తుంది.

సాధారణంగా భోజనం తర్వాత లేదా భోజనంతో పాటు పండ్లను తీసుకోవద్దని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది.

మామిడి పండ్లను మాత్రం భోజనంతో కలిసి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఉబ్బరం తగ్గుతుంది.

ఇక మామిడి ఆకులను మిక్సీలో పేస్ట్‌లా చేసి మీగడతో కలిపి ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇలా ఒక వారం రోజులు చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు, బ్లాక్ హెడ్స్ క్రమంగా తగ్గిపోతాయని అంటున్నారు.

మామిడి పండులో అనేక పోషకాలతోపాటు విటమిన్లు సైతం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.