ఒక గ్లాస్ కలబంద రసం  మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.

అలోవెరా జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు.

 వాతావరణం మారుతున్నా కొద్దీ చర్మంలోని మెరుపు మసకబారుతుంది. ఈ జ్యూస్‌ని రోజూ తాగితే అందమైన చర్మం మీ సొంతమవుతుంది.

అలోవెరాలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. కలబంద రసం తాగడంతో శరీరంలోని అనేక వ్యాధులు నయమవుతాయి.

ఎక్కువ మంది ఈ కలబందను చర్మానికి, జుట్టు సమస్యలకు మాత్రమే ఉపయోగిస్తుంటారు.

కలబంద చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. మచ్చలను పోగొడుతుంది. అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది

జుట్టుకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని జుట్టుకు అప్లై చేయడంతో చుండ్రు తొలగిపోతుంది. వెంట్రుకలు అందంగా తయారవుతాయి.

కుదుళ్లు బలంగా మారుతాయి. జుట్టు సిల్కీగా మారుతుంది. అందుకే ఈ కలబందను స్కిన్, హెయిర్ ప్రొడక్ట్స్ లో విరివిగా వాడుతుంటారు.

ఈ కలబంద జ్యూస్ బరువు తగ్గడానికి  సహాయపడుతుంది. కలబంద శరీరంలో మంటను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.