ఐస్ క్రీం తిన్న తరువాత పొరపాటున కూడా ఇవి తినకండి!

ఐస్ క్రీం చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టం. ముఖ్యంగా వేసవిలో దీనికి డిమాండ్ ఎక్కువ. కానీ ఐస్క్రీం తిన్న తరువాత పొరపాటున కూడా కొన్ని ఆహారాలు తినకూడదు.

ఐస్ క్రీం తిన్న తరువాత చల్లని నీరు తాగకూడదు. దీనివల్ల గట్, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

చల్లని ఐస్ క్రీం తిన్న తరువాత వేడిగా ఉన్నవి ఏవీ తినకూడదు, తాగకూడదు. కడుపులో రసాయన చర్యలకు ఇవి దారితీస్తాయి.

నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను ఐస్ క్రీం తరువాత తినకూడదు.

ఐస్ క్రీం తిన్న తరువాత మద్యం సేవించడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

ఐస్ క్రీం తిన్న తరువాత జంక్ ఫుడ్ తినకూడదు. దీనివల్ల కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు  చాలా ఈజీగా పెరుగుతాయి. వాంతులు, విరోచనాలు, తలతిరగడం వంటి  సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.