ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థలో ఇబ్బంది కలుగుతుంది. 

కడుపు నొప్పి, వికారం, వాంతులు, కడుపులో మంట వంటివి వస్తాయి. 

యాసిడ్ రిఫ్లక్స్ అంటే కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి రావడం. దీనివల్ల గుండెల్లో మంట కలుగుతుంది. 

మిరపకాయలకు కారం రుచిని ఇచ్చే కాప్సైసిన్ అనే పదార్థం నోరు, గొంతులో మంట కలిగిస్తుంది.

కొంతమందికి ముఖ్యంగా సున్నితమైన చర్మం లేదా మిరపకాయల అలెర్జీ ఉన్నవారికి ఎర్రటి దద్దుర్లు, దురద, వాపు వస్తాయి.

 పుండ్లు ఉన్నవారు ఎర్ర మిరపకాయలు తింటే లక్షణాలు ఎక్కువ అవుతాయి. మరింత ఇబ్బంది కలుగుతుంది.

ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల ఈ అవయవాలపై ఎక్కువ భారం పడుతుంది