ఇంట్లో ఆడ పిల్ల ఉందంటే  కాళ్లకు పట్టీలు  ఘల్లు ఘల్లు మని మోగాల్సిందే

అప్పుడు కానీ ఇంట్లో సందడి ఉండదు.పురాతన కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.వారి స్టేటస్ బట్టి బంగారు పట్టీలను ధరిస్తూంటారు.

పట్టీలను కేవలం లుక్ కోసం మాత్రమే కాదు.వెండి పట్టీలను ధరించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చన్న విషయం మీకు తెలుసా..

ఆడవారిలో పీరియడ్స్ వచ్చాయంటే అనేక ఇబ్బందులు పడుతూంటారు.పొత్తి కడుపులో నొప్పి,నడుం నొప్పి చిరాకు,నీరసం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

ఈ నొప్పులన్నింటిని తగ్గించడంలో వెండి సహాయచేస్తుంది .వివిధ రకాల నొప్పులతో బాధపడే వారు వెండి పట్టీలు,మెట్టెలు,వెండి ఆభరణాలను ధరించడం వల్ల  నొప్పి తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.

పురాతన కాలం నుంచి వెండి వస్తువులకు,ఆభరణాలకు ప్రాధాన్యత ఉంది.అప్పట్లో ఒంటి నిండా ఆభరణాలను ధరించే వారు మహిళలు.ఇలా ధరించడం వల్ల శరీరంపై అయ్యే గాయాలను త్వరగా నయం చేస్తుందట.