ఆహారంలో మునగా చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
మునగలో ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు (కాల్షియం, పొటాషియం, ఐరన్), విటమిన్లు (ఏ, సీ, ఈ) పుష్కలంగా ఉన్నాయి.
మునగలోని ‘విటమిన్ సీ’ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇన్ఫెక్షన్, ఇతర రోగాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా కలిగిన మునగ.. ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి.
ఇది కొలెస్టిరాల్ స్థాయిల్ని తగ్గించి, గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని పొటాషియం బీపీని రెగ్యులేట్ చేస్తుంది.
మునగను తరుచుగా తీసుకుంటే.. మొటిమలతో పాటు ఇతర చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఇది నియంత్రిస్తుంది. కాబట్టి.. డయాబెటీస్ బాధితులకు ఇది మంచిది.
తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగిన ఈ మునగ.. శరీర బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పురుషులు మునగను రెగ్యులర్‌గా ఆహారంలో చేర్చుకుంటే.. వారిలో ఇది లైంగిక శక్తిని పెంపొందిస్తుంది.
Related Web Stories
గులాబీ రేకుల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..!
నల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫ్రూప్ట్స్ ఇవీ..
ఈ డ్రైఫ్రూట్ తరచూ తీసుకుంటే కలిగే బెనిఫిట్స్ ఇవే..