లవంగం టీ ఆరోగ్యానికి  ఎంత మేలు చేస్తుందో తెలుసా..

లవంగాలలో యూజినాల్ అనే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి, ఇవి నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరంలో కఫాన్ని తొలగించేందుకు కూడా ఉపయోగపడుతాయి.

లవంగం టీ రోగనిరోధకశక్తిని బలపరుస్తుంది.

జలుబు, ఛాతీలో ఇబ్బంది లాంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు గృహవైద్యంగా లవంగ టీని తీసుకోవచ్చు.

లవంగాల టీని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగువుతుంది. మలబద్ధకం, గ్యాస్‌ వంటి సమస్యలు దూరమవుతాయి.

లవంగాలు ఆర్థరైటిస్ వంటి పరిస్థితులతో ఇబ్బందిపడేవారికి వాపును తగ్గించడంలో సహాయపడతాయి.