మన శరీరానికి నీరు అత్యవసరం.

తగినంత నీరు తాగకపోతే మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.

రోజుకు 1.5 లీటర్ల కంటే తక్కువ నీరు తాగే వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తక్కువ నీరు తాగిన వారి శరీరంలో కార్టిసాల్ స్థాయి ఎక్కువగా ఉందని తేలింది.

ఈ అధ్యయనంలో తక్కువ నీరు తాగిన వారికి దాహం వేయలేదు. కానీ వారి మూత్రం ముదురు రంగులో తక్కువగా ఉంది.

ఇది డీహైడ్రేషన్‌కు స్పష్టమైన సంకేతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నిద్ర, ఆహారం, వ్యాయామం ఎలాగైతే ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యమైనవో

అదే విధంగా నీరు కూడా మన మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం అని ఈ పరిశోధన చెబుతోంది.