మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.
మూత్రపిండాలు క్షీణించడం ప్రారంభించినప్పుడు, శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది.
మూత్రపిండాల వైఫల్యానికి కారణాలు ఇవె డయాబెటిస్,అధిక రక్తపోటు,యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్,దీర్ఘకాలిక మందుల వాడకం,జన్యుపరమైన సమస్యలు,కిడ్నీ రాళ్ళు లేదా గాయం మూత్రపిండ వైఫల్యం ప్రారంభ సంకేతాలు
శరీరంలో వాపు.. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు, శరీరంలో అదనపు నీరు – ఉప్పు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది
కిడ్నీ అనేది జల్లెడ లాంటిది.. ఇది శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది కిడ్నీకి సంబంధించిన సమస్య ఉంటే, విష పదార్థాలు శరీరం నుండి బయటకు రాలేవు
దీని కారణంగా, రోగికి నిరంతరం అలసట, బలహీనత లేదా తలతిరుగుతున్న సమస్యలు ఉండవచ్చు. కొంతమంది రోగులలో హిమోగ్లోబిన్ కూడా తగ్గవచ్చు.
మూత్రపిండాల వ్యాధి ఆకలి లేకపోవడం, ఆహార రుచిలో మార్పు లేదా నోటిలో చేదు రుచికి కారణమవుతుంది.
చర్మంపై దురద, మంట, పొడిబారడం లేదా ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ఎటువంటి అలెర్జీ లేదా నిర్దిష్ట కారణం లేకుండా నిరంతరం దురద ఉంటే, అది మూత్రపిండాల సమస్యకు సంకేతం కావచ్చు.