రాత్రి పడుకునే ముందు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే ఇన్ని లాభాలా...

వెల్లుల్లితో చాలా లాభాలున్నాయి. రాత్రుళ్లు వెల్లులి రెబ్బలు తినడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. 

రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయకారిగా పని చేస్తుంది.

కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయ పడుతుంది.

రక్తపోటు, మధుమేహ సమస్యలను నియంత్రిస్తుంది. 

వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు లివర్ పని చేయడానికి దోహదపడతాయి. 

అయితే వెల్లుల్లితో ఇన్ని లాభాలున్నా.. రాత్రుళ్లు వాటిని తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

పచ్చి వెల్లుల్లి తింటే హీట్ బర్న్, గ్యాస్, నోటి వాసన వస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉంటే మరీ ఇబ్బందిగా ఉంటుంది. యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటే మాత్రం వెల్లుల్లిని తినక పోవడమే మంచిది. ఒకవేళ వెల్లుల్లి తినాలకుంటే ఒక్క రెబ్బ తీసుకోవడం మేలు.