వయసు పెరుగుతున్నా ఫిట్‌గా  ఉండాలంటే ఇలా చేయండి..

రోజూ కనీసం 5నుంచి 10 నిముషాల పాటూ నడవాలి. 

మినీ వాక్ వల్ల బరువు తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల నుంచి ఇది రక్షిస్తుంది. 

ఆఫీసు పని వేళల్లో ప్రతి గంటకూ 5 నిముషాల నడక విరామం ఉండేలా ప్లాన్  చేసుకోవాలి. 

రాత్రి భోజనం తర్వాత తప్పనిసరిగా 5 నిముషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి. 

వారంలో కనీసం 150 నిముషాలు నడవడం అలవాటు చేసుకోవాలి. 

మొదట రోజులో తక్కువ సమయం నడిచినా క్రమంగా సమయాన్ని పెంచాలి.