మీరెప్పుడైనా పెరుగు, బెల్లం కలిపి తిన్నారా..? తింటే  ఎన్ని లాభాలో తెలుసా..?  

పెరుగుతో బెల్లం కలిపి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.  

 పెరుగు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి.

కడుపు సమస్యలు, వికారం, మలబద్ధకం,  వంటి సమస్యల నుండి ఉపశమనం  కలిగిస్తాయి

బరువు తగ్గడానికి పెరుగు, బెల్లం కలిపి తినమని నిపుణులు చెబుతున్నారు

పెరుగు, బెల్లం మిశ్ర‌మంలో యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి.

పెరుగు, బెల్లం మిశ్ర‌మాన్ని తిన‌డం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం కలిగిస్తుంది

పెరుగులో బెల్లం క‌లిపి తింటే ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి.

పెరుగు, బెల్లం మిశ్ర‌మంలో క్యాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముక‌లు, దంతాల‌ను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది.