ఆవు పాలు vs గేదె పాలు..  పిల్లలకు ఏది మంచిది

ఆవుపాలు, గేదె పాలలోని పోషకవిలువల్లో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. 

సాధారణంగా గేదె పాలల్లో ఆవుపాలకంటే వెన్న శాతం ఎక్కువ.

గేదె పాలల్లో ప్రొటీన్‌, కొన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు కూడా ఆవుపాలకంటే అధికంగానే ఉంటాయి. 

ఆరునెలలు దాటిన పిల్లలకు పరిమిత మోతాదుల్లో ఆవుపాలైనా గేదె పాలైనా ఇవ్వవచ్చు.

ఒకవేళ అరుగుదల ఇబ్బందులు ఉంటే గేదె పాలకంటే ఆవుపాలు తేలికగా జీర్ణమవుతాయి. 

ఎటువంటి పాలైనా, ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది అనిపిస్తే పిల్లలకు ఇచ్చే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.