మలబద్దకం వేధిస్తోందా..  మజ్జిగలో ఈ 2 పదార్థాలు  కలిపి తాగితే..

మలబద్దకం సమస్యకు ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, జీర్ణ సంబంధ సమస్యలు కారణమవుతాయి.

తిన్న ఆహారం సరిగా జీర్ణం కావాలంటే ఆహారంలో ఫైబర్, ద్రవ పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి.

అవి లేకపోతే తిన్న ఆహారం ప్రేగులలో సరిగా కదలిక లేకుండా స్థిరంగా ఉండిపోతుంది. 

జీలకర్ర, వాము.. జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. 

జీలకర్ర, వామును మజ్జిగలో కలిపి తీసుకుంటే మలబద్దకం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

ఒక స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ వాము పొడిని గ్లాసుడు మజ్జిగలో కలపాలి. 

ఈ మజ్జిగలో రుచి కోసం కొద్దిగా నల్ల ఉప్పు కలపాలి.

దీన్ని ఉదయం లేదా మధ్యాహ్నం ఆహారం తీసుకునేటప్పుడు తాగాలి.