ఆర్థరైటిస్ సమస్యకు ఆయుర్వేదం  చెప్పిన అదిరిపోయే చిట్కా..

ఆర్థరైటిస్ కు ఆయుర్వేదంలో చాలా రకాల చికిత్సలు ఉన్నాయి.

వాటిలో చాలా సింపుల్ గా ఉన్నది చింత గింజల వైద్యం.

చింత గింజలు కీళ్ల లూబ్రికేషన్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

చింతగింజలలో టానిన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి కొన్ని సమ్మేళనాలు ఉంటాయి.

ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

ఆయుర్వేద వైద్యుల సిఫారసు మేరకు చింత గింజల పొడిని నిర్ణీత మోతాదులో ఉపయోగించడం వల్ల ఆర్థరైటిస్ సమస్య నుండి చాలా వరకు ఉపశమనం ఉంటుంది.

యోగా, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు కీళ్లను దృఢంగా చేయడంలో సహాయపడతాయి.