కొందరు పాలను వేడిగా లేదా చల్లగా త్రాగడానికి ఇష్టపడతారు, మరికొందరు చాక్లెట్ వేసి త్రాగడానికి ఇష్టపడతారు.

అయితే పాలు తీసుకునే ముందు కానీ, తరవాత కానీ లేదా పాలతో కలిపి గానీ కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల అవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట.

ఈ పండ్లను మాత్రం పాలతో కలిపి తీసుకోకండి. అంతే కాదు. చిన్నారులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి.

పాలు, అరటిపండు కలిపి తింటే ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.

పాలు, పుచ్చకాయ కలిపి తీసుకుంటే అది మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల, వాటిని కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడవచ్చు.

ముల్లంగిని తీసుకున్న తర్వాత పాలు తీసుకోరాదు, ఎందుకంటే ఇది అననుకూలమైన ఆహార కలయికగా పరిగణించబడుతుంది.

 పాలతో సిట్రస్ ఆమ్ల పదార్థాలను కలపవద్దు. విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండ్లను కూడా పాలతో కలిపి తినకూడదు.