శరీరంలో కొవ్వును కొవ్వొత్తిలా కరిగిస్తుంది..

సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఒకటి. వీటిలో ఉత్తమ ఔషధ గుణాలుంటాయి. 

గుండెను యాలకులు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు రక్త ప్రసరణను సైతం మెరుగుపరుస్తుంది.

డయాబెటిక్ రోగులు.. వీటిని ప్రతీ రోజు రెండు నుంచి మూడు యాలకులు నమిలితే రక్తంలోని చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రించుకోవచ్చు.

వీటిలో విటమిన్ ఎ, సి, బి6, నియాసిన్‌లు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.

శరీరాన్ని యాలుకలు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇందులో ఉండే ముఖ్యమైన నూనెలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శ్వాసకోశ వ్యవస్థను మెరుగు పరుస్తాయి.

యాలకులు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో నమిలి తీసుకుంటే.. అది అద్భుతమైన మౌత్ ఫ్రెషనర్‌గా పని చేస్తుంది. వీటిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాను తొలగిస్తాయి.

యాలకులు ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అతిగా తినడాన్ని సైతం నియంత్రిస్తుంది.