కొవ్వు పదార్థాలు అధికంగా తింటే  రక్తపోటు వస్తుందా..?

కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

కొవ్వు పదార్థాలు అసాధారణ హృదయ స్పందనలకు కారణమవుతాయి. 

ఈ పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల ధమనులు ఇరుకుగా మారుతాయి.

దీంతో గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది.  దీన్నే అథెరోస్క్లెరోసిస్  అని అంటారు. 

కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడంతో రక్తాన్ని పంపింగ్ చేయడంలో గుండెకు ఇబ్బంది కలుగుతుంది.

కొవ్వు పదార్థాలు అధికంగా తింటే గుండెలో మంట, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు వస్తాయి, దీని వల్ల ఛాతీలో నొప్పి రావచ్చు. 

ఇది గుండె పనితీరును దెబ్బతీస్తుంది, అలాగే రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.

 గుండెకు తగినంత ఆక్సిజన్ అందకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.