బ్రౌన్ షుగర్ మంచిదా  తెల్లని చక్కెర మంచిదా?

తెల్ల చక్కెర, బ్రౌన్ షుగర్.. ఈ రెండు చెరకు నుండి తయారు చేసేవే. పైగా ఈ రెండు చక్కెరలను దాదాపు ఒకే విధంగా తయారుచేస్తారు.

ఆరోగ్య పరంగా తెల్ల చక్కెర తీసుకోవటం మంచిదని కాదని, గోధుమ రంగులో ఉండే బ్రౌన్‌ షుగర్‌ హెల్త్‌కి బెటర్‌ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గోధుమ రంగులో ఉండే బ్రౌన్‌ షుగర్‌ తయారీ కోసం తక్కువ ప్రాసెసింగ్ చేస్తారు.

తెల్లని చక్కెర బరువును పెంచుతుంది. అలాగే, తెల్లచక్కెర తయారీలో సల్ఫర్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు.

బ్రౌన్ షుగర్ బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తెల్ల చక్కెర కంటే చాలా తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది.

 స్త్రీలు పీరియడ్స్ సమయంలో నీటిని మరిగించి అందులో ఒక చెంచా బ్రౌన్ షుగర్, అల్లం, టీ ఆకులు వేసి తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

బ్రౌన్ షుగర్‌ను స్క్రబ్‌గా వాడితే చర్మం మృదువుగా మారుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కూడా ఉపయోగపడుతుంది.