స్నానం చేసినా.. శరీరం చెమట వాసన వస్తోందా? అందుకు కారణాలివే..

కొంతమందికి స్నానం చేసిన తరువాత కూడా చెమట వాసన పోదు. చెమట వాసన ఇబ్బందికరంగా ఉంటుంది.

హార్మోన్ల మార్పులు, హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల విపరీతమైన చెమట, శరీరం నుంచి దుర్వాసన వస్తుంది.

ఏదైనా వ్యాధి కారణంగా విపరీతమైన చెమట వస్తుంది. తద్వారా శరీరం నుంచి దుర్వాసన వచ్చే అవకాశం పెరుగుతుంది.

స్పైసీ ఫుడ్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆల్కహాల్, కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా చెమట దుర్వాసన వస్తుంది.

శరీరంలో ప్రొటీన్లు పెరగడం వల్ల దుర్వాసన కూడా పెరుగుతుంది.

ఎక్కువ ఒత్తిడి, ఆందోళన కారణంగా కూడా చెమట ఎక్కువ వాసన వస్తుంది.

చెమట వాసన ఎక్కువగా ఉంటే శరీరం ఒత్తిడికి లోనవుతుందని అర్థం.

శరీరంలో చెమటలు పట్టడం సహజమే. అయితే ఎక్కువ చెమట పట్టడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.